నా కొడుకులతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను.. అనసూయ సంచలన కామెంట్స్?
బుల్లితెరకు గుడ్ బై చెప్పి.. వెండితెరపై హంగామా చేస్తోంది హాట్ యాంకర్ అనసూయ
దిశ, సినిమా: బుల్లితెరకు గుడ్ బై చెప్పి.. వెండితెరపై హంగామా చేస్తోంది హాట్ యాంకర్ అనసూయ. ప్రస్తుతం ఈ యాంకర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 లో నటిస్తోంది. ఇక అనసూయ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలు ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఈ హాట్ బ్యూటీకి ఏ మాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్‌కు చెకేస్తుంది. పండగలు, స్పెషల్ ఈవెంట్స్ అసలు మిస్ అవదు. అయితే తాజాగా అనసూయ తన కుమారుల గురించి ఓ పోస్ట్ పెట్టింది. ‘‘నా కుమారుల వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరు చిన్న పిల్లలు కావడంతో బట్టలు విడిచే ముందు తమ జేబులు ఖాళీ చేయడం లేదు. వాళ్ళ జేబుల్లో ఉన్న వస్తువుల కారణంగా వాషింగ్ మిషిన్ పాడవుతుంది. దీంతో ప్రతి రెండు నెలలకు ఒకసారి వాషింగ్ మిషన్ సర్వీసింగ్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా ఇబ్బందిగా మారింది. మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందా?’’ అని ఫ్యాన్స్‌ను అడిగింది. అలాగే డస్ట్ బిన్ కనిపించే వరకు జేబులో వ్రాపర్ పెట్టుకునే వాళ్లంటే నాకు చాలా గౌరవం. అంటూ హాట్ యాంకర్ అనసూయ వెల్లడించింది.