తప్పుడు రాతలు రాస్తే ఎవరినీ వదిలిపెట్టను.. ఆవేశపడిన అనసూయ(Anasuya Bharadwaj)
దిశ, సినిమా : జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ మీడియాపై మండిపడింది. యూట్యూబ్ చానల్స్ లేదా న్యూస్ చానల్స్ ఇకపై తన గురించి తప్పుడు రాతలు రాస్తే కోర్టుకు వెళ్తానని స్పష్టం చేసింది.
దిశ, సినిమా : జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ మీడియాపై మండిపడింది. యూట్యూబ్ చానల్స్ లేదా న్యూస్ చానల్స్ ఇకపై తన గురించి తప్పుడు రాతలు రాస్తే కోర్టుకు వెళ్తానని స్పష్టం చేసింది. ఒకరి జీవితాన్ని జీవితంగా చూడరన్న బ్యూటీ.. ఇకపై ఇదే కంటిన్యూ అయితే కచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పింది. న్యూస్ క్రియేట్ చేయకుండా వాస్తవాలు రాయాలని సూచించింది. ఏజ్ షేమింగ్‌తో ఒత్తిడికి గురవుతున్నానని, ప్రశాంతత లేకుండా పోతున్నానన్న ఆమె.. డిప్రెషన్‌కు వెళ్లే చాన్స్ ఉందని చెప్పుకొచ్చింది. సినిమాలు, టీవీ షోస్‌లో జరిగే విషయాలకు.. నిజజీవితాలను పోల్చి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని ఆవేశపడింది. అయితే సినీపెద్దల సూచనలతో ప్రస్తుతానికి ఈ టాపిక్‌ను ఆపేస్తున్నాని.. కానీ ఎప్పటికైనా తన గురించి తప్పుడుగా రాసేవాళ్లని వదిలిపెట్టనని హెచ్చరించింది. #SayNoToOnlineAbuse, #StopAgeShaming అనే హ్యాష్ ట్యాగ్స్‌తో పలు ట్వీట్స్ చేసింది.
రైల్వే ఎగ్జామ్‌లో వేలిముద్ర మార్పిడి.. కోసి ఫ్రెండ్‌కిచ్చాడు.. చివరికి..