ఆ హీరోతో డేటింగ్‌పై స్పందించిన ‘లైగర్’ బ్యూటీ.. క్యూరియాసిటీ పెంచేస్తోంది

బ్యూటీఫుల్ యాక్ట్రెస్ అనన్యపాండే సహనటుడు ఆదిత్య రామ్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించింది.

Update: 2023-07-03 11:41 GMT

దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ అనన్యపాండే సహనటుడు ఆదిత్య రామ్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించింది. తను నటించిన తాజా మూవీ ‘డ్రీమ్ గర్ల్ 2’ ఆగస్టు 25న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా రెండు నెలలముందే ప్రమోషన్స్ నిర్వహిస్తున్న నటి.. తాజా సమావేశంలో తన పర్సనల్ విషయాలపై మాట్లాడింది. ‘ఈ సినిమాలో నా పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. చాలామందికి వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతుంది’ అని చెప్పింది. అలాగే సెలబ్రిటీల డేటింగ్‌పై జనాల్లో క్యూరియాసిటీ ఎక్కువగా ఉండటం సహజమేనన్న బ్యూటీ.. ప్రజలు తమ గురించి రకరకాలుగా ఊహించుకోవడాన్ని ఆస్వాదిస్తానని తెలిపింది. ‘అభిమానులకు మా పర్సనల్ లైఫ్ గురించి ఆతృత ఉండటం మంచిదే. నేను ఎవరితో డేటింగ్ చేస్తున్నానో ఎల్లప్పుడూ ఊహిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఆసక్తికరంగా మాట్లాడింది.

Read more : కింద మొత్తం విప్పేసి ఫ్రీగా పడుకున్న పాయల్.. మేము సర్వీస్ ఇవ్వమా అంటున్న కుర్రాళ్లు

Tags:    

Similar News