నరేశ్- రమ్య ఇష్యూలో ఊహించని ట్విస్ట్.. తెరపైకి మాజీ మంత్రి పేరు
ప్రముఖ సినీ నటుడు నరేశ్, ఆయన భార్య రమ్య వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ సినీ నటుడు నరేశ్, ఆయన భార్య రమ్య వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. రమ్యతో తనకు ప్రాణహాని ఉందంటూ నరేశ్ కోర్టును ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. రమ్య తన ఇంటి వద్ద కర్నాటక రౌడీ షీటర్ రాకేశ్ శెట్టి అనే వ్యక్తితో కలిసి రమ్య రెక్కీ నిర్వహించిందంటూ నరేశ్ పిటిషన్లో పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సమయంలో తన ఇంటివద్ద రెక్కీ నిర్వహించారంటూ ఆరోపించారు. అంతేగాక, ఓ పోలీస్ ఆఫీసర్ సాయంతో తన ఫోన్ను సైతం రమ్య హ్యాక్ చేయించిందంటూ కంప్లైంట్లో పేర్కొన్నారు. తాజాగా.. ఈ వ్యవహారంలోకి మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. రఘువీరారెడ్డి పేరు చెప్పి రమ్య బెదిరింపులకు దిగిందని నరేశ్ ఆరోపిస్తున్నారు. అలాగే రూ.10 కోట్లు ఇస్తే ఇష్యూను సెటిల్మెంట్ చేసుకుంటానంటూ బేరసారాలు సాగించినట్లుగా నరేశ్ ఫిర్యాదులో వివరించారు.
Also Read...