డార్లింగ్ అంటూ ఒకరినొకరు పొగిడేసుకున్న రష్మిక-విజయ్.. ట్వీట్స్ వైరల్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఒకరినొకరు తెగ పొగిడేసుకుంటున్నారు.
దిశ, సినిమా: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఒకరినొకరు తెగ పొగిడేసుకుంటున్నారు. రణ్‌బీర్ సరసన రష్మిక నటించిన నయా మూవీ ‘యానిమల్’ టీజర్‌ను రణ్‌బీర్ బర్త్ డే సందర్భంగా గురవారం రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఈ టీజర్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించిన రౌడీ హీరో.. ‘మై డార్లింగ్స్ @imvangasandeep @iamRashmika. అలాగే నాకెంతో ఇష్టమైన అభిమాన నటుడు రణ్‌బీర్ కపూర్‌కు కంగ్రాట్స్ అండ్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్’ అంటూ ఓ పోస్ట్ షేర్ చేశాడు. అయితే విజయ్ ట్వీట్‌పై వెంటనే రియాక్ట్ అయిన రష్మిక.. ‘థాంక్యూ.. విజయ్ దేవరకొండ. You be the bestestestestttt!’ అంటూ ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఇందుకు సబంధించిన ట్వీట్స్ వైరల్ అవుతుండగా ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.