'Amigos'.. ఆకట్టుకుంటున్న Kalyan Ram First Look!

'బింబిసార' మూవీతో మంచి హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. .

Update: 2023-01-05 09:03 GMT

దిశ, సినిమా: 'బింబిసార' మూవీతో మంచి హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇక అదే స్పీడ్‌తో 'అమిగోస్' అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్‌‌రామ్ త్రిపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ మైత్రీ మూవీ మేకర్స్ బృందం విడుదల చేసింది. కాగా ఇప్పటివరకు చూడని లుక్‌లో మెరిసిన జుట్టు, గడ్డంతో చేతిలో గన్ పట్టుకొని కళ్యాణ్ రామ్ మాస్‌గా కనిపిస్తున్నాడు. అలాగే మూవీ టీజర్‌ను జనవరి 8న ఉదయం గం.11:07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసిన మేకర్స్ ఫిబ్రవరి 10న ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించిన సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించాడు. 

Tags:    

Similar News