హాలీవుడ్ నుంచి వెళ్లిపోయిన స్టార్ నటి.. ఆ వివాదమే కారణమా?

హాలీవుడ్ యాక్ట్రెస్ అంబర్ హర్డ్.. హాలీవుడ్‌ను వదిలేసిందనే వార్తలపై ఆమె స్నేహితుడు స్పందించాడు. ఇటీవల తన కుమార్తెను తీసుకుని స్పెయిన్‌లోని

Update: 2023-05-14 09:08 GMT
హాలీవుడ్ నుంచి వెళ్లిపోయిన స్టార్ నటి.. ఆ వివాదమే కారణమా?
  • whatsapp icon

దిశ, సినిమా : హాలీవుడ్ యాక్ట్రెస్ అంబర్ హర్డ్.. హాలీవుడ్‌ను వదిలేసిందనే వార్తలపై ఆమె స్నేహితుడు స్పందించాడు. ఇటీవల తన కుమార్తెను తీసుకుని స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు వెళ్లిన నటి.. జానీ‌డెప్‌ వివాదం ఎఫెక్ట్‌తో ఇండస్ట్రీ నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. కాగా దీనిపై అంబర్ హర్డ్ ఫ్రెండ్స్ క్లారిటీ ఇచ్చినట్లు ఓ ప్రముఖ ఛానెల్ వెల్లడించింది. ‘ఆమె స్పెయిన్‌కు మకాం మార్చింది నిజమే. తన చిన్న కుమార్తెను కొంతకాలం ప్రశాంతమైన వాతవరణంలో పెంచాలనుకుంది. వివాదాలకు దూరంగా ఉంచాలనుకుంది. ప్రస్తుతం అక్కడ సంతోషంగా ఉంది. కానీ, హాలీవుడ్ నుంచి తప్పుకుంటున్నట్లు ఎవరితో చెప్పలేదు. ఆమె పనికోసం తొందరపడట్లేదు. సరైన ప్రాజెక్ట్, సరైన సమయం వచ్చినప్పుడు తిరిగి వస్తుంది’ అని తన స్నేహితుడు వివరించినట్లు సదరు మీడియా సంస్థ కథనం రాసుకొచ్చింది. 

Full View

Full View

Also Read..

తొమ్మిది రోజులకే వంద కోట్లు రాబట్టిన ‘The Kerala Story’ 

Tags:    

Similar News