ఆస్కార్ వేడుకలో రామ్ చరణ్ లైవ్ పర్ఫార్మెన్స్..
మెగా పవర్‌స్టార్ యు.ఎస్‌లో సందడి చేస్తున్నారు.
దిశ, సినిమా: మెగా పవర్‌స్టార్ యు.ఎస్‌లో సందడి చేస్తున్నారు. లాస్ ఏంజిల్స్‌లోని మార్చి 12న 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న నేపథ్యంలో ప్రముఖ పాపులర్ ఎంటర్‌టైన్మెంట్ చానెల్ KTLA తాజాగా చెర్రీని ఇంటర్వ్యూ చేసింది. ఈ మేరకు మాట్లాడిన చెర్రీ.. ‘రాజమౌళి అత్యుత్తమ చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. భారతదేశం ఎదుర్కొన్న వలసవాద అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటమే ఈ సినిమా. ‘నాటు నాటు’ చాలా అందమైన పాట. దాదాపు 300 మంది ప్రొఫెషనల్ డ్యాన్సర్లతో 7 రోజులు రిహార్సల్స్ చేసి 17 రోజుల పాటు చిత్రీకరించారు’ అని చెప్పాడు.
అలాగే ‘ఆస్కార్ వేడుకలకు హాజరవడంతోపాటు ఓ అతిథిగా ఉండటం నా జీవితంలో అద్భుతమైన క్షణాలు. ఆ బ్లాక్ లేడీని మా టీమ్‌తో కలిసి మా దేశానికి తీసుకెళ్లడానికి ఎగ్జయిట్మెంట్‌తో ఎదురుచూస్తున్నా. 85 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియన్ సినిమా గుర్తింపు పొందండం ఆనందంగా ఉంది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుకలో చేయబోతున్న లైవ్ పెర్ఫామెన్స్ గురించి తెలియని ఎగ్జయిట్‌మెంట్ నెలకొంది. ఆస్కార్ వేడుకల్లో లైవ్‌లో ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకులకు నా ప్రేమను చూపించడం అనేది ఓ మార్గం. అలా చేయటం నేను వారికిచ్చే రిటర్న్ గిఫ్ట్’ అంటూ మురిసిపోయాడు.