అరుదైన గౌరవం అందుకుంటున్న అల్లు అర్జున్.. టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మ

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అలాగే పలు యాడ్స్‌లోనూ కనిపిస్తున్నాడు.

Update: 2023-10-06 09:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అలాగే పలు యాడ్స్‌లోనూ కనిపిస్తున్నాడు. తాజాగా, అల్లు అర్జున్ ఓ అరుదైన ఘనతను సాధించారు. మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌లో మొదటి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ మైనపు బొమ్మను ఏర్పాటు చేస్తున్నారు. మేడమ్స్ టుస్సాడ్స్ దుబాయ్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఉన్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించొచ్చు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్స్ విషయానికి అల్లు అర్జున్ తొలి తెలుగు నటుడు కాదు.

ఇక అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఏర్పాటు కోసం ఆయన కొలతలను మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్ బృందం తీసుకుంది. ఈ విషయాన్ని మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్ ట్విట్టర్‌లో ఒక వీడియోను నిర్వాహకులు పోస్ట్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ నలుపు రంగు సూట్‌లో హుందాగా కనిపిస్తున్నారు. మరి ఇదే రూపంలో ఆయన మైనపు బొమ్మ ఉండబోతోందేమో చూడాలి. అయితే ఈ విషయం తెలిసిన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Tags:    

Similar News