ఆ పాట కోసం చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరైనోడు’ చిత్రం ఏ రేంజ్లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.
దిశ, సినిమా: బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరైనోడు’ చిత్రం ఏ రేంజ్లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అయితే ఈ మూవీలోని ఓ పాట కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చావు అంచుల వరకు వెళ్లొచ్చాడట. పాట అద్భుతంగా ఉంటే.. పాటకు దగ్గట్లు లొకేషన్స్ కూడా అంతకుమించి బాగుండాలని అనుకుంటారు. ఈ సినిమాలో అల్లు అర్జున్-రకుల్ ప్రీత్ సింగ్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ‘తెలుసా తెలుసా’ అనే పాటకోసం అల్లు అర్జున్ తో హీరో, హీరోయిన్, డైరెక్టర్ తో సహా టీం మొత్తం కూడా ఆక్సిజన్ చాలా తక్కువ ఉండే ఒక ప్రాంతంలో షూట్ చేసి ప్రాణాలకు తెగించి మరీ పని పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగొచ్చారట.
ఈ సాంగ్ అద్భుతంగా రావాలని భావించిన అల్లు అరవింద్ ఎంత ఖర్చైనా పర్వాలేదు. కానీ సాంగ్ గ్రాండ్ ఇయర్ గా ఇప్పటివరకు ఎవరూ తీయనంత క్వాలిటీగా తీయాలని దర్శకుడితో చెప్పారట. దీంతో బోయపాటి శ్రీను ఏకంగా ఇప్పటివరకు ఇండియా లో ఎవరూ ఒక షూట్ చేయని లొకేషన్‌ను కన్ఫర్మ్ చేసుకుని మరి వెళ్లి చేసుకోవచ్చాడు. ఇంతకీ ఆ లోకేషన్ ఏంటంటే.. సౌత్ అమెరికాలోని బొలీవియా. అక్కడ నుంచి 50 గంటల పాటు విమానంలో ప్రయాణం చేస్తే కానీ ఆ బ్యూటిఫుల్ లోకేషన్ రాదు. అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది.
కాబట్టి గట్టిగా మాట్లాడకుడదు. ఫాస్ట్ గా నడవకూడదు. ఇక ఈ సాల్ట్ ఫ్లాట్ లొకేషన్ లో కింద అంతా ఉప్పు ఉంటుంది. ఎవరైనా మిస్టేక్‌లో జారి కిందపడిన, స్కిన్ మొత్తం తెగిపోతుంది. అంత షార్ప్ ఉప్పు పై షూట్ చేశారంటే అర్థం చేసుకోవాలి బన్నీ ఎంత రిస్క్ చేశాడో. టీమ్ అంతా నాలుగు రోజుల పాటు ఈ సాహసం చేసి తక్కువ ఆక్సిజన్ ఉన్న ఆ ప్రాంతంలోనే షూటింగ్ పూర్తిచేసుకుని ఇండియాకి తిరిగివచ్చారట. కష్టానికి తగ్గ ఫలితం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా యువతను ఎంతగానో ఆకట్టుకుంది.