పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న అల్లు అర్జున్.. పెద్ద ప్లానే ఇది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నాడు.

Update: 2024-06-27 04:31 GMT

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇక ఈ రకంగా ఆయన సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలాగైనా సరే మరోసారి పవన్ కళ్యాణ్‌ను కలిసి మేమంతా ఒక్కటే అని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

తాజాగా ప్రొడ్యూసర్స్ అందరూ పవన్ కళ్యాణ్ ని కలవడానికి వెళ్ళినపుడు వాళ్లలో అల్లు అరవింద్ కూడా అక్కడికి వెళ్లి పవన్ కళ్యాణ్ తో మాట్లాడాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అల్లు అరవింద్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మరోసారి వైసీపీ పార్టీ తరఫున క్యాంపెనింగ్ చేసిన ఆయన పవన్ కళ్యాణ్ ను కలిసి మరోసారి వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ను నిరూపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి అల్లు అర్జున్ వచ్చి పవన్ కళ్యాణ్‌ను కలిస్తే ఆయన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.



Similar News