Allu Arjun : భార్యకు దూరంగా ఉంటున్న బన్నీ స్నేహ రెడ్డి అలా చేసినందుకేనా?
టాలీవుడ్లో స్టైలిష్ కపుల్ అంటే అందరికీ గుర్తు వచ్చే మొదటి పేరు అల్లు అర్జున్, స్నేహ రెడ్డి. వీరు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇక ఈ మధ్య స్టైలిష్ స్టార్
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్లో స్టైలిష్ కపుల్ అంటే అందరికీ గుర్తు వచ్చే మొదటి పేరు అల్లు అర్జున్, స్నేహ రెడ్డి. వీరు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇక ఈ మధ్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి హాట్ హాట్ ఫొటో షూట్‌తో రచ్చ చేస్తుంది. స్టైలిష్ డ్రెస్సింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ అమ్మడు త్వరలో సినిమాలకు ఎంట్రీ ఇవ్వబోతుందంటూ నెట్టింట్లో ఓ న్యూ స్ తెగ షికారు చేసింది. కానీ దీనిపై అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.
కాగా, మరో రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్య ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న స్నేహరెడ్డి బిహేవియర్ బాగాలేదంట. రీసెంట్గా వారు ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ తన భార్య బిహేవియర్ బన్నీకి అస్సలు నచ్చలేదంట. స్నేహ.. అసలు బన్నీకి స్టైలిష్ స్టార్ బిరుదు ఎలా వచ్చిందో కూడా తెలియడం లేదని.. స్టైల్ విషయంలో అర్జున్ ది జీరో నాలెడ్జ్ అని స్నేహ మాట్లాడిందట. దీంతో అర్జున్‌కి స్నేహ మీద చాలా కోపం వచ్చిందంట. కానీ సైలెంట్‌గానే ఉండిపోయాడట. అయితే ఈమధ్య బన్నీ స్నేహకి ఫొటో షూట్ విషయంలో కండీషన్ పెట్టాడంట. దీంతో భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందంట. ఈ క్రమంలోనే స్నేహ అల్లు అర్జున్‌ని అనరాని మాట అందంట. దీంతో హర్ట్ అయిన బన్నీ, స్నేహకు దూరంగా ఉంటున్నాడని టాక్. ఇక దీనిపై అల్లూ ఫ్యామిలీ స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదు.