ఘనంగా అల్లు అర్జున్ చెల్లెలి నిశ్చితార్థం.. వైరలవుతోన్న ఫొటోస్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. రీసెంట్‌గా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, వెంకటేష్ చిన్న కుమార్తె పెళ్లి, దగ్గుబాటి అభిరామ్.. ఇలా స్టార్ హీరోల పిల్లల వెడ్డింగ్ బెల్స్ మోగుతున్న విషయం తెలిసిందే. ఇలా ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు బుల్లితెర నటీనటులు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇకపోతే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెల్లెలు ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు అల్లు అర్జున్ చెల్లెలు నిశ్చితార్థం జరగడం ఏంటి? బన్నీకి సిస్టర్స్ లేరు కదా? అనే డౌట్ వచ్చే ఉంటుంది.
అయితే పుష్ప సినిమాలో బన్నీకి తల్లి పాత్రలో బుల్లితెర నటి కల్పలత నటించిన సంగతి తెలిసిందే. ఈ నటి బన్నికి తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. కాగా కల్పలతకు ఇద్దరు కుమార్తెలు. వీరు ఫారెన్‌లో జాబ్ చేస్తున్నారు. తాజాగా కల్పలత తన పెద్ద కుమార్తెకు ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపించారు. ప్రస్తుతం కల్పలత పెద్ద కుమార్తె ఎంగేజ్ సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పలువురు అల్లు అర్జున్ చెల్లెలు నిశ్చితార్థం అంటూ ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ వేడుకకు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరయ్యారని తెలుస్తోంది.