మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బన్నీ అద్భుతమైన నటనకు ఇప్పటికే జాతీయ అవార్డును సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సిక్వెల్‌గా పుష్ప-2 ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
బన్నీ ఫ్రెండ్ గా నటించిన కేశవ పలు గొడవల వల్ల షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో మూవీ టీం కేశవను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఇకపోతే అల్లు అర్జున్ కు ఈ సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డును అందుకోబోతున్నాడు. ఇందుకోసం బన్నీ తాజాగా జర్మనీ వెళ్లాడు. ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనడానికి నిన్న బెర్లిన్ బయలుదేరాడు.
ఈ ఇంటర్నెషనల్ అవార్డు ఫిల్మ్ ఫెస్టివల్లో ఐకాన్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘పుప్ప: ది రైజ్’ ని స్పెషల్‌గా ప్రదర్శించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఇంటర్నేషనల్ దర్శకులు, చిత్ర నిర్మాతలు, మార్కెట్లో సినిమా హక్కుల బయ్యర్స్ తో కూడా బన్నీ మీట్ అవ్వనున్నారని సమాచారం. ‘పుష్ప’ మూవీ స్క్రీనింగ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ మీడియాతో అల్లు అర్జున్ మాట్లాడనున్నారు. ఇక పార్ట్-2 ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.