మంచు లక్ష్మికి బిగ్ ఛాలెంజ్ విసిరిన అల్లు అర్జున్.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రానికి పలు అవార్డులు కూడా వచ్చాయి.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రానికి పలు అవార్డులు కూడా వచ్చాయి. దీనికి సిక్వెల్‌గా పుష్ప-2 మూవీ త్వరలో రాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఓ వైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. తాజాగా, అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అసలు విషయంలోకి వెళితే.. మంచు లక్ష్మికి ఓ టాస్క్ ఇచ్చాడు.
ఓ నెల పాటు అన్నం, నాన్ వెజ్ తినకుండా ఉండాలని ఛాలెంజ్ విసిరారు. దానికి మంచు లక్ష్మి ఒప్పుకుంది. ఈ విషయాన్ని ఓ పోస్ట్ ద్వారా అందరికీ తెలిపింది. ‘‘అల్లు అర్జున్ నా గోల్స్ పబ్లిక్‌తో షేర్ చేసుకోవాలని తెలిపారు. నేను అంగీకరిస్తున్నాను. నేను ఈ నెలలో రైస్, నాన్ వెజ్‌కు దూరంగా ఉండాలన్న ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా. అవి రెండు లేకుండా ఉండలేను నాకు ఫేవరెట్. ఇక ఏం జరుగుతుందో చూడాలి’’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ను అల్లు అర్జున్ షేర్ చేస్తే మంచు లక్ష్మికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.