గురూజీ జెర ఆలోచించరాదే.. బన్నీకి త్రిష అక్కలా ఉంటుందేమో?
లియో సినిమాలతో హిట్ అందుకున్న త్రిషకు ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: లియో సినిమాలతో హిట్ అందుకున్న త్రిషకు ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఇటీవలే ఈ బ్యూటీపై నటుడు మన్సూర్ అలీఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మన్సూర్ అసభ్యకర మాటలను ఖండిస్తూ పలువురు సినీ ప్రముఖులు స్పందించి.. ఆగ్రహం వ్యక్తం చేయటంతో తాజాగా ఈ నటుడిపై కేసు నమోదు అయ్యింది. ఇందంతా పక్కన పెడితే.....మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కన్ను త్రిష మీద పడినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత ఈ దర్శకుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో జతకట్టబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో బన్నీ కోసం హీరోయిన్‌ను వెతికే వేటలో పడ్డాడు. చాలా మంది కథానాయికలను సంప్రదించగా.. చివరకు సీనియర్ హీరోయిన్ త్రిషను ఎంపిక చేసినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ‘బన్నీ అన్నకు త్రిషకు అసలు సెట్ కాదు. బన్నీ కన్నా ఆమె ఓ ఏడాది చిన్నదే అయినా.. పక్కన ఆయన పక్కకు అక్కలా కనిపిస్తుంది. గురూజీ మరోసారి ఆలోచించు జెర’ అంటూ అల్లు అర్జున్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.