Allu Arjun: ఎన్టీఆర్ ట్వీట్ పై స్పందించిన.. అల్లు అర్జున్‌ రిప్లై ఏమిచ్చాడో తెలుసా?

ఈ క్రమంలోనే ఎన్టీఆర్, బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్‌ చేశారు

Update: 2023-04-09 04:16 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏప్రిల్ 8 న అల్లు అర్జున్‌ తన 41వ పుట్టిన రోజును గ్రాండుగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా బర్త్ డే విషెస్‌ చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్‌ చేశారు. ''హ్యాపీ బర్త్‌డే బావ. ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా'' అంటూ ట్వీట్‌ చేసాడు. అల్లు అర్జున్ ''నీ లవ్లీ విషెస్‌కు థ్యాంక్యూ బావా. నీకు నా హగ్స్‌..'' అని రిప్లై ఇచ్చారు. దీనిపై ఎన్టీఆర్‌ ''కేవలం హగ్స్‌ మాత్రమేనా? పార్టీ లేదా పుష్ప?'' అంటూ ట్వీట్ చేయగా.. దీనికి అల్లు అర్జున్‌ ''వస్తున్నా'' అంటూ రిప్లై ఇచ్చాడు. ఇద్దరు బిగ్ స్టార్స్ ఇలా సరదాగా ట్వీట్స్ చేసుకోవడంపై సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: 'ఇండియన్-2': ముగిసిన తైవాన్ షెడ్యూల్

Tags:    

Similar News