సంచలన రికార్డ్ సృష్టించిన అల్లు అర్జున్.. ఇండియా నుంచి బన్నీ ఒక్కడే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

Update: 2023-07-25 13:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. పుష్ప మొదటి పార్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంతగా క్రేజ్ దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఏకంగా 21.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఏ స్టార్ సాధించని రికార్డును బన్నీ సాధించారు. కాగా ఇటీవలే మార్కెట్‌లోకి కొత్త సోషల్ మీడియా యాప్ వచ్చింది. అది కూడా ట్విట్టర్‌‌కు పోటీగా మార్క్ జుకర్ బర్గ్ ‘థ్రెడ్స్’ యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్‌లో మన ఇండియన్ స్టార్స్ చాలా మంది అకౌంట్లు ఓపెన్ చేశారు. ‘ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ అందులో ఉన్నారు. ఈ థ్రెడ్స్ యాప్‌లో బన్నీ అప్పుడే 1 మిలియన్ ఫాలోయర్స్‌ను దక్కించుకోవడం గమనార్హం. ఇండియాలో ఇప్పటివరకు ఏ స్టార్ కూడా ఈ ఘనత దక్కించుకోలేదు. కాగా 1మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకొన్న ఫస్ట్ సినీ నటుడిగా బన్నీ రికార్డు సృష్టించాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.



Tags:    

Similar News