జాతీయ ఉత్తమ నటుడిగా Allu Arjun.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

భారతదేశంలో అత్యంత ప్రముఖ చలనచిత్ర అవార్డుల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ‘నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’‌ను 2021 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2023-08-24 12:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో అత్యంత ప్రముఖ చలనచిత్ర అవార్డుల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ‘నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’‌ను 2021 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో మొత్తం ఏడు భాషలు పోటీ పడగా.. 30 సినిమాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అయితే, ఇందులో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తొలిసారి పది అవార్డులను సొంతం చేసుకొని తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా 6 అవార్డులను సొంతం చేసుకోగా, పుష్ప రెండు అవార్డులను సాధించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక కాగా.. ఈ అవార్డు అందుకోబోతున్న తొలి తెలుగు నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. అవార్డుతో పాటు అల్లు అర్జున్ రూ.50 వేల ప్రోత్సాహక నగదును కూడా అందుకోనున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా బన్నీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

‘Rocketry: The Nambi Effect’ : బెస్ట్ ఫిల్మ్‌గా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’.. ఎంత ప్రైజ్ మనీ ఇస్తారో తెలుసా?

69వ జాతీయ చలన చిత్ర అవార్డులు.. సత్తా చాటిన తెలుగు సినిమాలు

Tags:    

Similar News