చాలా గ్యాప్ తర్వాత గ్లామర్ పిక్స్ షేర్ చేసిన అలియా భట్
బాలీవుడ్ నటి అలియా భట్ గురించి పరిచయం అక్కర్లేదు.
దిశ, సినిమా: బాలీవుడ్ నటి అలియా భట్ గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది ఏప్రిల్‌లో రణ్‌బీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక కుమార్తెకు జన్మనిచ్చి ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తునే సినిమాలు కూడా మొదలు పెట్టేసింది. తాజాగా చాలా రోజుల తర్వాత మంచి ఫొటో షూట్‌తో నెట్టింట దర్శనమిచ్చింది. ఇది ‘ది గ్లాస్’ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫొటో షూట్ అని తెలుస్తోంది. ఇందులో అలియా భట్ తనలోని స్టైల్ యాంగిల్ మళ్లీ బయటకి తీసుకొచ్చింది. వివిధ రకాల కాస్ట్యూమ్స్‌లో దిగిన ఆమె ఫొటోలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఒక బిడ్డకు తల్లి అంటే నమ్మశక్యం కాని విధంగా వంగి వంగి మరి అందాలు చూపిస్తుంటే అలియా భట్ అదరహో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.