సపోర్ట్ ఉంటే సరిపోదు.. మనలో సత్తా ఉండాలి: ‘నేపో బేబీ’ ట్యాగ్‌పై అలియా

‘నేపో బేబీ’ ట్యాగ్‌పై అలియా భట్ మరోసారి తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయింది.

Update: 2023-04-27 06:32 GMT

దిశ, సినిమా: ‘నేపో బేబీ’ ట్యాగ్‌పై అలియా భట్ మరోసారి తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయింది. కెరీర్ ప్రారంభంలో తనను అలా గుర్తించడం సాధారణంగానే భావించి పెద్దగా పట్టించుకోలేదన్న ఆమె.. కాలక్రమంలో బంధుప్రీతి పేరిట తనపట్ల వివక్ష చూపించడం ఇబ్బందిగా అనిపించిందని చెప్పింది. ‘కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో నెపోటిజం గురించి చర్చ నడుస్తోంది. అయితే కెరీర్ మొదలుపెట్టడానికి ఇది సహాయం చేసినప్పటికీ, అంతిమంగా ప్రేక్షకుల నిర్ణయమే ముఖ్యమని నేను నమ్ముతా.

చిత్ర పరిశ్రమలోకి ఏ సపోర్టుతో వచ్చినా సరే.. మన పనిని నిరూపించుకుంటేనే ఇక్కడ నిలబడగలం. లేదంటే ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడమే. అందుకే కష్టపడి పని చేయడమంటే నాకు ఇష్టం. ప్రతి సినిమాలో ఉత్తమ ప్రతిభ కనబరచాలనుకుంటా. మీరు ఇక్కడ ఉండాలో లేదో అభిమానులే తుది నిర్ణయం’ అంటూ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడింది.

Also Read..

పవన్ కల్యాణ్‌‌కు పెద్దగా హిట్లు లేవు, నటన రాదు.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు! 

Tags:    

Similar News