ఆ ఒక్కటే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్: Alia Bhatt

బాలీవుడ్‌ అండ్ హాలీవుడ్‌‌కు మధ్య ఉన్న తేడాలపై అలియా భట్ ఓపెన్ అయింది.

Update: 2023-06-27 11:58 GMT

దిశ, సినిమా: బాలీవుడ్‌ అండ్ హాలీవుడ్‌‌కు మధ్య ఉన్న తేడాలపై అలియా భట్ ఓపెన్ అయింది. తను నటించిన ‘ది హార్ట్ ఆఫ్ స్టోన్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటిని.. ఈ రెండు ఇండస్ట్రీల‌లో పెద్ద తేడా కనిపించిందా? అన్ని విలేఖరి ప్రశ్నించాడు. దీనికి బదులిస్తూ ‘నిజంగా నాకేమీ కొత్తగా అనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోయే ఒక సినిమాకు పనిచేస్తున్నట్లే ఫీల్ అయ్యాను. ఇక్కడ-అక్కడ అదే వ్యక్తులు.. అదే దృష్టి, అవే ఆత్మలు, అవే ఆలోచనలు. కేవలం భాష మాత్రమే భిన్నమైనది. చివరికి కథ చెప్పింది కూడా అదే పద్ధతి. ఎక్కడైనా ప్రధానంగా భావోద్వేగాలను పండించడం కోసమే పనిచేయాలి. చివరికి ప్రేక్షకులకు కనెక్ట్ కావాలి’ అని చెప్పింది. ఇక హాలీవుడ్ మూవీతోపాటు రణ్‌వీర్‌తో నటించిన హిందీ సినిమా ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’ జూలై 28న విడుదలకానుంది.

Read more:

Shraddha Das : అందంగా కనిపించడంకోసం శ్రద్ధదాస్ ఆ పని చేస్తుందా!

Tags:    

Similar News