అలియా భట్-రణబీర్ కుమార్తె క్యూట్ వీడియో వైరల్.. ఎంత ముద్దొస్తుందో..!!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అండ్ రణబీర్ కపూర్ ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-03-06 10:47 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అండ్ రణబీర్ కపూర్ ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2022 ఏప్రిల్ 14 వ తారీకున వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా అలియా ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ బుజ్జాయికి రాహా అని పేరు పెట్టారు. అందరి సెలబ్రిటీల్లాగే వీరు కూడా తమ బిడ్డ ఫేస్ చూపించకుండా చాలా జాగ్రత్త పడ్డారు. రెండేళ్ల తర్వాత క్యూట్ రాహా ఫేస్ రివీల్ చేశారు.

అలియా డాటర్ ను చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. తాజాగా మరోసారి అలియా భట్-రణబీర్ కపూర్ తమ పాప కలిసి ఓ ఫంక్షన్ కు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ క్యూట్ ఫ్యామిలీ కెమెరాకు చిక్కారు. అందులో రణబీర్ రాహాను ఎత్తుకుని వెళ్తున్నాడు. అలియా రణబీర్ కపూర్ పక్కన నడుస్తుంది. ఎంతో అమాయకంగా క్యూట్‌గా చూస్తున్న రాహా క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. సో క్యూట్, అలియా లాగే చాలా క్యూట్‌గా ఉన్నావ్ బేబీ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున రాహాపై లవ్‌లీ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

 

 

 

 


Similar News