పెళ్లి చీరలో నేషనల్ అవార్డు అందుకున్న అలియా.. ప్రశంసల వర్షం
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ సింప్లిసిటీ అందరినీ ఆకట్టుకుంది.
దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ సింప్లిసిటీ అందరినీ ఆకట్టుకుంది. తన పెళ్లికి ధరించిన శారీని.. నేషనల్ అవార్డు అందుకునే సమయంలో కట్టుకుని సూపర్ సింపుల్ ఉమన్ అనిపించుకుంది. సిల్వర్ కలర్ చీర పూర్తిగా గోల్డ్ కలర్ జరీ వర్క్ తో నిండి ఉండగా.. మ్యాచింగ్ నెక్ పీస్ తో అమేజింగ్ గా కనిపించింది. కాగా 'గంగూబాయి కతియావాడి' మూవీకి గాను ఉత్తమ నటిగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న ఆమె.. భర్త రణ్ బీర్ తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైంది. ఇక ఆయన బ్లాక్ సూట్ లో దర్శనమివ్వగా.. భార్యను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈవెంట్ కు చేరుకున్నాడు. ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ.. సినీ జర్నీని కంటిన్యూ చేసేందుకు మద్దతుగా నిలుస్తున్నాడు.