అలియా భట్ తన కూతురు ఏం కావాలనుకుంటుందో తెలుసా? నవ్విపోతున్న నెటిజన్స్..
కెరీర్ తొలి రోజుల్లో మినిమమ్ నాలెడ్జ్ లేదని విమర్శలపాలైన అలియా భట్.. తన యాక్టింగ్ స్కిల్స్‌తోనే ఆన్సర్ చెప్పేసింది.
దిశ, సినిమా : కెరీర్ తొలి రోజుల్లో మినిమమ్ నాలెడ్జ్ లేదని విమర్శలపాలైన అలియా భట్.. తన యాక్టింగ్ స్కిల్స్‌తోనే ఆన్సర్ చెప్పేసింది. పాన్ ఇండియా మూవీస్ చేస్తూనే హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. ఇక ప్రజెంట్ కరణ్ జోహార్ దర్శకత్వంలో ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ మూవీతో అలరించేందుకు సిద్ధమైంది. జూలై 28న సినిమా విడుదల కానుండగా.. ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడిపేస్తోంది బ్యూటీ. ఈ క్రమంలోనే కూతురు రహ గురించి మీడియా ప్రశ్నించగా.. తన కూతురి కళ్లలోకి చూస్తుంటే సైంటిస్ట్ అవుతుందని అనిపిస్తుందని చెప్పింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. కరణ్ రహను కచ్చితంగా హీరోయిన్ చేస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. అయినా తల్లిదండ్రులు సరిగ్గా లేనప్పుడు బిడ్డ అంత గొప్పగా ఎలా ఎదుగుతుందని విమర్శిస్తున్నారు.