నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు: అక్కినేని అఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ పెళ్లంటే చాలా భయం వేస్తుందంటున్నాడు.
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ పెళ్లంటే చాలా భయం వేస్తుందంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కెరీర్, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. ‘స్కూల్ డేస్‌లో ఓ పక్క క్లాసులు జరుగుతుంటే.. మేము గ్రౌండ్‌లో క్రికెట్ ఆడేవాళ్లం. ఎన్నో కిటికీల అద్దాలు పగలగొట్టి టీచర్లకు దొరికాం. క్రీడలంటే నాకు చాలా ఇష్టం. సోషల్ మీడియా గురించి ఎక్కువ తెలియదు. అదంటే భయం, బిడియం. అందుకే ఎక్కువగా పోస్టులు పెట్టను. నా సినిమాల గురించి మాత్రమే అప్‌డేట్ ఇస్తాను. ఇటీవల నా పెళ్లి గురించి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నా. మింగిల్ అయ్యే ఆలోచన లేదు. నా విషయంలో లవ్ అంటే స్పోర్ట్స్ మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: తారక్‌తో ఒక్క చాన్స్ ఇవ్వమని దేవుడిని వేడుకున్నా: జాన్వీ కపూర్..