Akira : అడవిలో అలసిపోయి కూర్చున్న అకిరా.. వైరల్ అవుతున్న ఫోటోస్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు, అకిరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ప్పటి నుంచి అకిరా కు సంబంధించిన

Update: 2024-07-30 14:50 GMT

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు, అకిరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ప్పటి నుంచి అకిరా కు సంబంధించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో అకిరా పవన్‌తో ఉండటం, ఫలితాల విడుదల రోజు కూడా తన నాన్నతో కలిసి ఉండి, ప్రజలకు థాంక్స్ చెప్పిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

కాగా, తాజాగా మరోసారి అకిరాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత అకిరా తన తల్లి రేణు దేశాయ్‌, చెల్లి ఆద్య తో కలిసి అడవిలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అందులో ఇలా రాసుకొచ్చింది..ఆదివారం పూట ఊరికే ఖాళీగా కూర్చోకుండా నేను, నా ఫ్రెండ్స్ ఆద్య, అకిరా ఫ్రెండ్స్‌తో అడవిలో ఎంజాయ్ చేశాం, సోషల్ మీడియాకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉండటం చాలా బాగా నిపించిదంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోస్, వీటియోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అకిరా అడవిలో అలసిపోయి కూర్చొన్నటువంటి ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News