మెగాస్టార్ సినిమాతో అకీరా ఇండస్ట్రీ ఎంట్రీ? సంబురాలు చేసుకుంటున్న ఫ్యాన్స్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ గురించి తెలిసిందే.

Update: 2024-09-30 10:19 GMT

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ గురించి తెలిసిందే. ప్రజెంట్ తన అమ్మ రేణు దేశాయ్ దగ్గరే ఉంటున్న అకీరా.. అప్పుడప్పుడు తండ్రి పవన్ కల్యాణ్‌తో కనిపిస్తూ మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం అందుకున్న తర్వాత అకీరా తండ్రి వెంటే ఉన్నాడు. వీళ్లిద్దరిని ఒకే దగ్గర చూసిన ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు. ఇదిలా ఉంటే.. తన అభిమాన హీరో పవన్ కల్యాన్ కొడుకు అకీరా ఇండస్ట్రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఇప్పటికే చాలా సార్లు రేణు దేశాయ్‌ను కూడా ఈ విషయంపై ప్రశ్నించారు. కానీ ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అకిరా అసలు సినిమాలు చేస్తాడా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు మెగా అభిమానులు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు అకీరా వెండితెర ఎంట్రీకి సమయం ఆసన్నమైనట్లు టాక్. తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు టాక్. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ‘విశ్వంభర’లో అనేక మంది స్టార్ హీరోలు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరా కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడని ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. అంతే కాకుండా త్వరలో అకీరా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఈ వార్త వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ మాత్రం సంబురాలు చేసుకుంటున్నారు.  


Similar News