రాజమౌళి దర్శకత్వంలో అజిత్-అల్లు అర్జున్ మల్టీస్టారర్?
ప్రజంట్ ఇండస్ర్టీలో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది.
దిశ, సినిమా: ప్రజంట్ ఇండస్ర్టీలో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు కలిసి నటిస్తూ అలరిస్తున్నారు. ఇక తాజాగా మరో సూపర్ అప్ డేట్ అయితే వినపడుతుంది. టాలీవుడ్‌లో రైటర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ అంటే తెలియని వారుండరు. ‘RRR’ వంటి సూపర్ హిట్ సినిమా కథ అందించి ఆయన ఇంటర్నేషనల్ రైటర్‌గా గుర్తింపు పొందారు. మరి అలాంటి విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు మరో మల్టీస్టారర్‌ను తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాకు డైరెక్టర్‌గా రాజమౌళినే వ్యవహరించబోతున్నాడని టాక్ కూడా వినిపిస్తుంది. మహేష్ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ఇదే అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ఈ మల్టీస్టారర్ మూవీలో హీరోలుగా అజిత్, అల్లు అర్జున్‌ను ఎంచుకోగా కథ బాగా నచ్చడంతో వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈసారి రికార్డులను ఆపడం ఎవరి తరం కాదు.