ఆ పేరు కోసం నాలుగు నెలలు కష్టపడ్డాం.. Aishwarya Rai Bachchan

దిశ, సినిమా: ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన కూతురుకు పేరు పెట్టడానికి నాలుగు నెలలు సమయం పట్టిందని చెప్పింది..Latest Telugu News

Update: 2022-06-13 08:28 GMT

దిశ, సినిమా: ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన కూతురుకు పేరు పెట్టడానికి నాలుగు నెలలు సమయం పట్టిందని చెప్పింది. 2011 నవంబరు 16న బేబీ గర్ల్‌ను ఈ ప్రపంచంలోకి అభిషేక్, ఐశ్వర్యలు స్వాగతించిన విషయం తెలిసిందే. అయితే తన గారాల పట్టికి చారిత్రాత్మకమైన లేదా ఆధ్యాత్మికమైన నామకరణం చేయాలని ముందే ఫిక్స్ అయినట్లు చెప్పిన నటి.. భారతీయ సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని 'ఆరాధ్య' అంటే 'పూజకు అర్హులు' అని అర్థం వచ్చేలా పేరు సెలక్ట్ చేసేందుకు నాలుగు నెలలు పట్టిందని తెలిపింది.

అయితే తమది పెద్ద కుటుంబం కావడంతో విభిన్న అభిప్రాయాలు తీసుకోవడంతో ఆలస్యమైందన్న ఐశ్వర్య.. ఇంత సమయం గడిచిపోయిన విషయం కూడా తమకు తెలియలేదని పేర్కొంది. ఇక తన కూతురుకు సంబంధించిన ఫొటోలు, స్కూల్ ఈవెంట్‌లలో ప్రదర్శన ఇచ్చిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ నటి ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్‌లో వస్తున్న 'పొన్నియిన్ సెల్వన్: ఐ'తో ప్రేక్షకులు ముందుకు రానుండగా.. ఈ మూవీ 2022 సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది.


Similar News