తండ్రి అయిన తర్వాత ఆ అలవాటు మానుకున్న అల్లు అర్జున్
టాలీవుడ్ స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ‘పుష్ప’ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ‘పుష్ప’ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో ఆయన నటనకుగాను ఏకంగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డుతో సత్కరించబడ్డాడు. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే .. అల్లు అర్జున్ కెరియర్ లో ఎంత మంచి సక్సెస్ అందుకున్నాడో, వ్యక్తిగత జీవితంలో కూడా తన భార్య, పిల్లలతో అంతే సంతోషకరమైన జీవితం గడుపుతున్నాడు. తన పిల్లల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ.. కుదిరినప్పుడల్లా వారితో సమయం గడుపుతూ ఉంటాడు.
అయితే తాజాగా బన్ని తన ఫ్యామిలీ పిల్లల గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. ‘తండ్రిగా ప్రమోట్ అయిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి?’ అనే ప్రశ్న అల్లు అర్జున్ కు ఎదురుకాగా.. ‘ పెళ్లి కాకముందు నాకు ఇష్టం వచ్చిన విధంగా ఉండేవాడిని. నా నోటి వెంట బూతులు ఎక్కువగా వచ్చేవి. పిల్లలు పుట్టిన తర్వాత బూతులు మాట్లాడటం మానేశా. ఆ అలవాటును పూర్తిగా మానుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హీరో కామెంట్స్ వైరల్ అవుతుండటంతో, నెటిజన్స్, అభిమానులు అల్లు అర్జున్ బూతులు మాట్లాడతాడా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు.