Adivishesh: ఆ హీరోయిన్‌ను జుట్టు పట్టుకొని లాక్కెళ్లిన హీరో.. ఇష్టం లేకపోయినా చేశానంటూ..

Update: 2024-07-23 13:44 GMT

దిశ, సినిమా : అడవి శేష్ అంటేనే అదో రకం రా బాబు.. అంటుంటారు కొందరు సినీ లవర్స్. ఒక్కో నటుడి ఫిజికల్ స్ట్రక్చర్, యాక్టింగ్ స్టైల్ ఒక్కో విధంగా ఉంటుంది. అట్లనే ఈ యంగ్ హీరో స్టైల్ కూడా సో డిఫరెంట్ అని తెగ మురిసిపోతుంటారు అతని అభిమానులు. పైగా అతడు థ్రిల్లర్ జానర్‌లోనే ఎక్కువ చేయడంతో వాటికి డెఫినేషన్‌లా మారిపోయిండు. దీంతో అడవి శేష్ ఏదైనా మూవీ చేస్తున్నడంటే.. ‘ఎలాగూ హిట్ పక్కా మావ’ అని మాట్లాడుకుంటారు యూత్ పోరగాల్లు. కారణం.. థ్రిల్లర్ జానర్‌లో మెప్పించడంలో అతనికి అతనే సాటి.

ఇంకో విషయం ఏంటంటే.. అడవి శేష్ స్వయంగా స్ర్కీన్‌ప్లేను కూడా రాసుకుంటాడట. అతని సినిమాలు ఆడటానికి ఇదొక కారణమని కూడా కొందరు చెప్తుంటారు. బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూ జోరుమీదున్న ఈ హీరో.. రీసెంట్‌గా గూఢచారి సీక్వెల్‌ను కూడా స్టార్ట్ చేసిండు. కాగా ఈ మూవీ స్ర్కిప్టును రెడీ చేయడానికే ఏడాదిన్నర టైమ్ తీసుకున్నాడట. కథ ప్రిపరేషన్‌కే అంత టైమ్ తీసుకున్నడంటే.. ఇక ఏ రేంజ్‌లో ప్రిపేర్ చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు అతని అభిమానగణం.

ఇకపోతే అడవి శేష్‌కు సంబంధించి ప్రజెంట్ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏంటంటే.. కెరీర్‌ ప్రారంభంలో పంజా, బలుపు వంటి సినిమాల్లో అతను నెగెటివ్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడవి శేష్.. బలుపు మూవీలో హీరోయిన్(శృతిహాసన్) జుట్టు పట్టుకొని లాక్కెళ్లే సీన్ ఉందని, తనకు ఇష్టం లేకపోయినా అది చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుండగా.. చేసింది సినిమాలోనే కదా.. ఎందుకంత ఫీల్ అవుతారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 

Tags:    

Similar News