క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులతో అడివి శేష్
టాలీవుడ్‌లో థ్రిల్లర్ సినిమాలకు పెట్టిన పేరు అడివి శేష్. ‘హిట్ 2’తో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కూడా యాప్ట్ అయిపోయాడు.
దిశ, సినిమా: టాలీవుడ్‌లో థ్రిల్లర్ సినిమాలకు పెట్టిన పేరు అడివి శేష్. ‘హిట్ 2’తో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కూడా యాప్ట్ అయిపోయాడు. దీంతో అలాంటి సినిమాలు చేయాలంటే దర్శక, నిర్మాతలు సైతం ముందుగా అడివి శేష్‌నే అప్రోచ్ అవుతున్నారు. ఆయన హీరోగా నిలబడటానికి ముఖ్య కారణం కూడా థ్రిల్లర్ జోనర్ సినిమాలే. కాగా ప్రజంట్ తన సూపర్ హిట్ ఫిల్మ్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా కొత్త ప్రాజెక్ట్ ‘G2’ మూవీ పనిలో ఉన్నాడు. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే తాజాగా ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లలతో కొంత సమయాన్ని గడిపాడు.
వెనుకబడిన కుటుంబాలకు సహాయం చేస్తున సెయింట్ జూడ్ అనే సంస్థను సందర్శించిన శేష్.. ఆ సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వారితో కలిసి వేడుకలు జరుపుకోవడానికి వెళ్లాడు. ఇందులో భాగంగా శేష్ చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేసి నవ్వించాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక జూడ్ సంస్థ పిల్లలకు రోజూ అరగంట డ్యాన్స్ క్లాస్ ఏర్పాటు చేస్తూ వారిని ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. క్యాన్సర్‌పై పోరాటంలో డ్యాన్స్ థెరపీని భాగంగా చేసుకుంది.