అదా శర్మ కాంట్రవర్శియల్ సినిమా ‘బస్తర్ ది నక్సల్ స్టోరీ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అదా శర్మ తెలుగులో హార్ట్ ఎటాక్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Update: 2024-02-20 07:49 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అదా శర్మ తెలుగులో హార్ట్ ఎటాక్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా స్టార్ డమ్ రాకపోవడం కొద్ది కాలం పాటు సినిమాలకు దూరమైంది. 2023లో కాంట్రవర్శియల్ మూవీ ది కేరళ స్టోరీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మే5న విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఇటీవల అదా శర్మ మరో కాంట్రవర్శియల్ మూవీతో రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.

దీనిని మళ్లీ సుదిప్తో సేన్ డైరెక్షన్ చేస్తుండగా విపుల్ అమృత్‌లాల్ షా నిర్మిస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన ఆధారంగా రాబోతుంది. దీనికి బస్తర్: ది నక్సల్ స్టోరీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇటీవల దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, బస్తర్ ది నక్సల్ స్టోరీ రిలీజ్ డేట్‌ను చిత్రయూనిట్ ప్రకటించింది. మార్చి 15న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ .. అదా శర్మ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ షేర్ చేసింది.

Read More..

బాలీవుడ్‌లో అలాంటి సీన్స్‌ చేసేందుకు రెడీ అయిపోయిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్..!  

Tags:    

Similar News