హాయిగా డబ్బు కోసం అలా చేస్తాను.. కానీ పెళ్లి, పిల్లలు నా వల్ల కాదు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన స్టార్ నటి
నందిని రెడ్డి తెరకెక్కించిన ‘అలా మొదలైంది’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నటి స్నిగ్ద తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది
దిశ, సినిమా: నందిని రెడ్డి తెరకెక్కించిన ‘అలా మొదలైంది’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నటి స్నిగ్ద తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 43 ఏళ్లొచ్చినా ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదని ప్రశ్న ఎదురవ్వగా.. ‘పెళ్లిపై నమ్మకం లేదు. పెళ్లి చేసుకోవాలని అసలు ఆలోచనే లేదని డైరెక్ట్‌గా చెప్పేసింది. అలాగే నేను దీక్షలో ఉంటానని, 120 రోజుల దీక్షలోనే టైమ్ సరిపోతుంది. వివాహం అనేది సోల్ పర్పస్ నుంచి పక్కకు తీసుకెళ్తుంది.
సో పెళ్లి చేసుకోవాలనిపించడం లేదు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని.. వారిని పోషిస్తూ.. తమ చుట్టూ తిరిగే లైఫ్ కన్నా.. హాయిగా డబ్బు సంపాదించి, అనాథాశ్రమాలకు ఇస్తే బాగుంటుంది. ఆ పిల్లలైనా బాగుపడతారు. నాకు చిన్నప్పుడు లవ్ ప్రపోజల్స్ కూడా వచ్చాయి. అప్పుడు నేను రెబల్ గా ఉండేదాన్నని, ఆ అబ్బాయికి బెదిరించాను. ఇక పెద్దాయ్యాక నా ప్రాణ స్నేహితుడే ప్రపోజ్ చేశాడు.
పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. కానీ ఈ రోజుల్లో పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిచ్చాక.. వారికి టైమ్ ఇవ్వడం లేదు. వారికి మంచి, చెడు చెప్పేవాళ్లు లేరు. దీంతో పిల్లలు రౌడీలుగా మారుతున్నారు. కాగా అతడితో జీవితాంతం బెస్ట్ ఫ్రెండ్ లా ఉంటానని చెప్పాను. ఈ విషయం గురించి మా ఇంట్లో కూడా అడిగారు. అందరికీ క్లారిటీగా చెప్పేశా. అంటూ స్నిగ్ద చెప్పుకొచ్చింది.
ఇక స్నిగ్ద.. సింగర్‌గా, నటిగా.. హీరో, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈమె ఎప్పుడు షర్ట్, ప్యాంట్ ధరించి, అబ్బాయి వేషధారణలో ఉండేందుకు ఇష్టపడుతుంది. డిఫరెంట్ మైండ్ సెట్ తో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.