Actress Karthika Nair : ఘనంగా జరిగిన నటి రాధ కుమార్తె వివాహం..

సీనియర్ హీరోయిన్ రాధా కుమార్తె కార్తిక గురించి పరిచయం అక్కర్లేదు.

Update: 2023-11-20 09:05 GMT

దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ రాధా కుమార్తె కార్తిక గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా పలు సినిమాలలో నటించినప్పటికి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ వ్యాపార రంగంలో మాత్రం విజయాన్ని అందుకుంది. దుబాయ్ లో ఉన్నటువంటి బిజినెస్ లు అన్నింటినీ కూడా ఈమె ఎంతో చక్కగా డీల్ చేస్తుంది. ఇక ఇటివల కార్తిక తన ప్రియుడు రోహిత్ మీనన్ తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

కాగా తాజాగా ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. కేరళలోని త్రివేండ్రంలో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా అలనాటి టాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవితోపాటు సీనియర్ హీరోయిన్స్ అందరూ ఈ పెళ్లి వేడుకలో కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News