Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెన్షన్.. క్లీన్ చిట్ వస్తేనే సస్పెన్షన్ ఎత్తివేత!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సస్పెషన్ వేటు వేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సస్పెషన్ వేటు వేసింది. తన ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసినట్లు గురువారం మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. హేమను ‘మా’ నుంచి సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ప్రెసిడెంట్ మంచు విష్ణు బుధవారం మా అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. అయితే సభ్యులంతా హేమను సస్పెండ్ చేయాల్సిందే అంటూ రిప్లేలు ఇచ్చినట్లు తెలిసింది.
దీంతో హేమను సస్పెండ్ చేయాలని మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని తాజాగా ప్రకటించారు. కాగా, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. కానీ తానేమీ తప్పు చేయలేదంటూ హేమ చెప్పుకొచ్చింది.