గెస్ట్ హౌస్‌కి రాకుంటే నీ ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేస్తా అంటూ.. చాందిని చౌదరిని బెదిరించిన నటి
షార్ట్ ఫిలీంస్ ద్యారా మంచి పాపులారిటి సంపాదించుకున్న చాందిని చౌదరి తన అందం నటనతో అనతి
దిశ, సినిమా: షార్ట్ ఫిలీంస్ ద్యారా మంచి పాపులారిటి సంపాదించుకున్న చాందిని చౌదరి తన అందం నటనతో అనతి కాలంలోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘కేటుగాడు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత సుహాన్ హీరోగా నటించిన ‘కలర్ ఫోటో’ మూవీతో తన అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులకు ఫిదా చేసింది. ఇక రీసెంట్‌గా విశ్వక్ నటించిన ‘గామి’ సినిమాతో అలరించి మరో హిట్ అందుకుంది. ఇక తెలుగుతో పాటు ఇతర భాషల నుండి కూడా అవకాశాలు అందుకుంటున్న చాందిని చేతిలో ప్రజంట్ అరడజను సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా చాందిని కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.
ఏంటీ అంటే టాలీవుడ్ క్యూట్ బ్యూటీ నటి స్నిగ్ధ గురించి పరిచయం అవసరం లేదు. అచ్చమైన తెలుగు అమ్మాయి అయిన ఆమె అబ్బాయిలా రెడీ అవుతూ... కేవలం టామ్ బాయ్‌లా కనిపించే పాత్రలు మాత్రమే చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాధించుకుంది. అయితే తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న స్నిగ్ధ చాందిని కి సంబంధించి ఓ విషయం పంచుకుంది.
మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఏడిపించారా? అని అడగ్గా ఆమె ఇలా మాట్లాడుతూ ‘చాందిని చౌదరిని సరదాగా ఏడిపించాను. గెస్ట్ హౌస్‌కు రావాలని లేకపోతే ఫోటోలు నీ ఫోటోలు వీడియోలు మార్ఫిన్ చేస్తామంటూ బెదిరించాం. తను నిజంగా భయపడింది బాగా ఏడ్చింది. అయితే అసలు విషయం చెప్పిన తర్వాత చాందిని నువ్వు ఎక్కడున్నావ్ అంటూ అడిగింది. పలానా ప్లేస్ లో ఉన్నాను అని చెప్పగానే అక్కడికి వచ్చి లాగిపెట్టి కొట్టింది’ అని తెలిపింది స్నిగ్ధ. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
Read More..
2 రుపాయిలే కదా అని ఆ లింక్ క్లిక్ చేస్తే రూ. 2 లక్షలు కట్ అయ్యాయి.. తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన