నరేష్ నాలుగు పెళ్లిళ్లపై స్పందించిన దర్శకుడు.. తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడుగా..!
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ నవ మన్మథుడిగా పేరు తెచ్చుకున్నాడు.
దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ నవ మన్మథుడిగా పేరు తెచ్చుకున్నాడు. వరుస పెళ్లిళ్లతో ఈయన తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. నరేష్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుని.. వారితో విడిపోయాడు. ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. ఇద్దరు కలిసి ఒకే దగ్గర సహజీవనం చేస్తున్నామని.. ఒకరి మనసు ఒకరికి అర్థమైందని, దీంతో మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నామని, ఫ్యూచర్ లో పెళ్లి కూడా చేసుకోవచ్చు అంటూ స్వయంగా నరేష్ పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా నరేష్ కుమారుడు నటుడు, దర్శకుడు నవీన్ విజయ్ కృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై తండ్రి పెళ్లిళ్లపై స్పందించాడు. ‘‘పెళ్లి చేసుకోవడం మా నాన్న వ్యక్తిగత విషయం. అందులో నేను జోక్యం చేసుకోలేదు. నాన్న ఎక్కడ సంతోషం ఉంటాడో అక్కడకు వెళ్తున్నాడు. తన సంతోషాన్ని తాను వెతుకుంటున్నారు తప్పేముంది. నా పెళ్లి విషయంలో నన్ను కూడా నీకు ఏలా ఉండాలనిపిస్తే అలా ఉండు అంటాడు. అక్షింతలు వేసి పోతానన్నాడు. నానమ్మ విజయ్ నిర్మల కూడా అదే చెప్పేవారన్నారు.
లైఫ్లో ఎవరి స్క్రీన్ ప్లే వాళ్లది. ఎవరి లైఫ్ వారే డిజైన్ చేసుకోవాలి. నాన్న కంటే బయట చాలా మంది ఎన్నో వివాహాలు చేసుకున్నవారున్నారు. వాళ్లవి ఇంకా వివాదంగా ఉంటాయి. కానీ అవి బయట పడవు. నాన్న నటుడు కాబట్టి ఏ చిన్న విషయమైనా పబ్లిసిటీ అవుతుంటుంది. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. నాన్న పెళ్లిళ్ల ద్వారా సమాజానికి ఏం చెబుతున్నారనే వాదన వినిపిస్తుంది. కానీ ఆయన్నుంచి నేను తీసుకున్న సందేశం ఏంటంటే.. జీవితంలో రాజీ పడకుడదు.
నీ సంతోషం నీకు కావాలంటే ముందుకు వెళ్లిపో.. వద్దంటే అక్కడే ఆగిపో అనేది తీసుకున్నాను. రెండు సినిమాల్లో నటించాను. ఒక మూవీ రిలీజ్ అయింది. మరో సినిమా విడుదల కాలేదు. నానమ్మకోరిక మేరకు దర్శకుడిగా కొనసాగాలని అనుకుంటున్నాను. నాకు ఎడిటింగ్ మంచి పట్టు ఉంది. ఇటీవల సాయిధరమ్ తేజ్, స్వాతి ప్రధాన పాత్రల్లో ‘సత్య’ అనే షార్ట్ ఫిల్మ్ లో రూపొందించాను. త్వరలోనే దీన్ని రిలీజ్ చేయబోతున్నాను’’. అంటూ నరేష్ కుమారుడు విజయ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. Actor Naresh's son Vijay Krishna's comments went viral