రైల్వే గేటు పక్కన నటుడి డెడ్ బాడీ.. అసలు ఏం జరిగిందంటే?
సీనియర్ హీరో మురళీ మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ అనే చిత్రంతో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేశారు. దాసరి నారాయణరావు
దిశ, సినిమా : సీనియర్ హీరో మురళీ మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ అనే చిత్రంతో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేశారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన తిరుపతి సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత ఈయన అనేక సినిమాల్లో నటించి తెలుగు అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఇక ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి జయభేరి గ్రూప్ సంస్థను ప్రారంభించి,దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇక చిత్ర పరిశ్రమలో మూవీ షూటింగ్ సమయంలో ఎంతో మంది ప్రమాదాలకు గురి అవుతారు. కొందరైతే ఏకంగ ప్రాణాలు కోల్పోతారు. కానీ చాలా వరకు దీనికి సంబంధించిన సమాచారం ఎక్కువగా బయటకు రాదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు మురళి మోహన్, ఆసక్తికర విషయాలను తమ అభిమానులతో పంచుకున్నాడు. అందులో తాను షూటింగ్ చేస్తున్న సమయంలో ఎదుర్కొన్న రెండు సంఘటనలను ఆయన గుర్తు చేసుకొని బాధపడ్డారు. ప్రస్తుతం ఆ రెండు సంఘటనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దాసరి నారాయణరావు దర్శకత్వంలో బంగారక్క సమయంలో జరిగిన ఓ సంఘటన ఇప్పటికీ ఆయన మనసును కలిచి వేస్తుందంట. దాని గురించి నటుడు మాట్లాడుతూ.. సినిమాలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది. ఆమె షూటింగ్ సమయంలో ఎక్కువగా చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉండేది. ఒక రోజు ఔట్ డోర్ షూటింగ్‌కు పిల్లలతోపాటు ఓ పాప వచ్చింది. కానీ మా లెక్కల ఆ పాప లేదు. కానీ కొందరు వచ్చి మాత్రం మా పాప కనిపించడం లేదు సినిమా కోసం వచ్చిందని అడగ్గా, మేము ఆ రోజు, చెరువులో షూట్ చేశాం. దీంతో అందరూ కలిసి చెరువు మొత్తం వెతకగా పాప మృతదేహం కనిపించింది. కానీ పాప సినిమాలో లేదు, సినిమాలో నటించే ఇంకో పాపతో ఈమె వచ్చినట్లు తెలిసింది. కానీ పాప మృతదేహం చూస్తే కన్నీరు ఆగలేదు. ఆరోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను, అది మరువలేని సంఘటన అని ఆయన తెలిపారు.
అదేవిధంగా, అద్దాల మేడ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. కేవీ చలం కూడా మాతో పాటు నటిస్తున్నాడు. కానీ ఒక రోజు ఆయన షూటింగ్‌కు రాలేదు. దీంతో మేము ఇంటికి కాల్ చేయగా ఆయన నిన్న షూటింగ్ కోసమే వచ్చారు. నిన్నటి నుంచి ఇంటికి రాలేదు అని సమాధానం వచ్చింది.అప్పటికీ మేము మొత్తం వెతికాము, కొద్ది సేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి రైల్వే ట్రాక్ పక్కన ఓ డెడ్ బాడీ ఉంది గూర్ఖాలా ఉన్నారని చెప్పారు. అప్పుడు మేము ఇంటికి ఫోన్ చేసి నిన్న చలం ఏ డ్రెస్ వేసుకున్నాడని అడగ్గా ఖాకీ బట్టలని తెలపడంతో, డెడ్ బాడీని చూడటానికి వెళ్తే చలంనే. దీంతో ఒక్కసారిగా మేమందరం షాక్ అయ్యాం. చాలా బాధపడ్డాం, అతనికి అందరం కలిసి ఘనంగా అంత్యక్రియలు చేశాం. ఆ సంఘటన ఇప్పటికీ నా మనసును కలిచి వేస్తుందంటూ షాకింగ్ విషయాలను పంచుకున్నారు.