పెళ్లిచేసుకున్న నటి మహాలక్ష్మి.. భర్తను చూసి షాకవ్వొద్దు! (వీడియో)
ఈ వేడుకకు సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. Actor Mahalakshmi, producer Ravindar Chandrasekaran ties knot.
దిశ, వెబ్‌డెస్క్ః మరుపురాన్ని సన్నివేశాల్లో వివాహం ముందుంటుంది. అయితే, తాజాగా ప్రముఖ నటి-యాంకర్ వీజే మహాలక్ష్మి ఆ ఆనందాన్ని మరోసారి అనుభవించారు. ప్రముఖ కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్, మహాలక్ష్మి సెప్టెంబర్ 1న తిరుపతిలో నిర్వహించిన సింపుల్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, వివాహానికి సంబంధించిన చిత్రాలను వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్ అయ్యాయి. ఇన్‌స్టాలో చిత్రాలను పంచుకున్న మహాలక్ష్మి "నువ్వు నా జీవితంలో ఉండడం నా అదృష్టం.. నీ ప్రేమతో నా జీవితాన్ని నింపావు.. లవ్ యూ అమ్మూ" అంటూ భర్తకు అభినందనలు తెలిపింది.
అయితే, వీరిద్దరు మొదటిసారి చంద్రశేఖరన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన థ్రిల్లర్ 'విడియుం వరై కాతిరు' సెట్స్‌లో కలుసుకున్నారు. కాగా, వీరిద్దరికీ ఇది రెండవ వివాహం. మహాలక్ష్మి గతంలో అనిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ 2019లో వివిధ సమస్యల కారణంగా అతనితో విడాకులు తీసుకుంది. టీవీ నటుడు ఈశ్వర్‌తో అక్రమ సంబంధం ఉందని ఈశ్వర్ భార్య చేసిన ఆరోపణల నేపధ్యంలో అనిల్‌తో విడాకులు కోరుకుంది. కాగా, అనిల్‌తో ఉన్న వైవాహిక జీవితంలో ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
రవీందర్ లిబ్రా ప్రొడక్షన్స్ అనే ప్రముఖ నిర్మాణ సంస్థ యజమాని. 'సుత్త కాదై,' 'నలనుమ్ నందినియుమ్,' 'నాట్పెన్న ఎన్నెన్ను తేరియుమా' సినిమాలు ఆయన నిర్మించిన వాటిల్లో కొన్ని. ఇక, మహాలక్ష్మి టీవీ సీరియల్స్ నటిగా పాపులారిటీ పొందింది. వాణి రాణి, ఆఫీస్, చెల్లమాయ్, ఉతిరిపూక్కల్, ఒరు కై ఒసై వంటి ధారావాహికల్లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందిన నటి. తమిళ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహాలక్ష్మి నటి కాకముందు వీడియో జాకీగా, యాంకర్‌గా పనిచేశారు.