ఆ వ్యాధితో ఆరేళ్లుగా బాధపడుతున్న Ayushmann Khurrana

టెలివిజన్‌ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయుష్మాన్‌ ఖురానా .. 'విక్కీ డోనార్‌' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు.

Update: 2022-11-22 14:30 GMT

దిశ, సినిమా: టెలివిజన్‌ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయుష్మాన్‌ ఖురానా .. 'విక్కీ డోనార్‌' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు కమర్షియల్‌ హిట్‌గా నిలిచి విమర్శకులు ప్రశంసలు అందుకున్నాయి. డాక్టర్‌ జీ, గులాబో సితాబో, బాలా, బధాయి హో వంటి సినిమాలు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టగా.. రీసెంట్‌గా ఫ్యాన్స్‌తో ముఖ్యమైన విషయం పంచుకున్నాడు. తను వెర్టిగో సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సందర్భాల్లో ఈ సమస్య తనను ఎంతగా ఆందోళనకు గురిచేస్తుందో చెప్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. 'ఆరేళ్ల క్రితం నుంచి వెర్టిగో సమస్యతో బాధపడుతున్నా. ఈ సమస్య ఉన్న వారికి డిజీనెస్‌, పరిసరాలు తిరుగుతున్న ఫీలింగ్‌, బ్యాలెన్స్‌ కోల్పోవడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. చెవుల్లో శబ్దాలు వినిపిస్తాయి. చెమట ఎక్కువ పడుతుంది. అస్థిరత కోల్పోతాం. ఒత్తిడి ఎక్కువైతే స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి' అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : 'Ala Vaikunthapurramuloo ' రీమేక్.. హిందీ టీజర్ ఎలా ఉందో తెలుసా?


Similar News