వెంకటేష్ నా మొదటి స్నేహితుడు.. ఖుష్బూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సీనియర్ నటి ఖుష్బూ చాలాకాలం తర్వాత గోపీచంద్ సినిమా ‘రామబాణం’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
దిశ, సినిమా: సీనియర్ నటి ఖుష్బూ చాలాకాలం తర్వాత గోపీచంద్ సినిమా ‘రామబాణం’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. హీరో విక్టరీ వెంకటేష్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ‘నా తొలి సినిమా హీరో వెంకటేష్ గారితో చేశాను. ఆయన నాకు చాలా సెంటిమెంట్. నా మొదటి స్నేహితుడు. ఇప్పటికీ వెంకటేష్‌తో ప్రతి రోజూ మాట్లాడుతా. నాకే సమస్య వచ్చినా అతను నాతో ఉంటాడు.
సెంటిమెంట్ అనే వర్డ్‌లో వెంకటేష్ సెంటి అయితే.. నేను మెంట్. అంత క్లోజ్‌గా ఉంటాం. మా జనరేషన్ హీరోయిన్లు 32 మందికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. మెమంతా గ్రూప్‌లో తిన్న వంటకాలు, చేసిన పనుల గురించి ముచ్చటిస్తాం. ఆ గ్రూప్‌లో వెంకటేష్ కూడా ఉన్నారు. కానీ, ఎప్పుడూ రెస్పాండ్ కాలేదు. ఎన్నిసార్లు చెప్పినా అలానే బిహేవ్ చేస్తాడు’ అని చెప్పుకొచ్చింది.