Aishwarya అసలు క్యారెక్టర్ బయటపెట్టిన Abhishek.. కుటుంబాలే నాశనమయ్యాయంటూ
బయటకెళ్లి చికాకు, కోపంతో ఇంటికి వచ్చినప్పుడు ఐశ్వర్య రాయ్ ఎలా స్పందిస్తుందో అభిషేక్ బచ్చన్ వెల్లడించాడు. ప్రస్తుతం ‘ఘూమర్’ ప్రచారంలో బిజీగా గడుపుతున్న ఆయన.. రీసెంట్ ఇంటర్వ్యూలో కెరీర్ అండ్
దిశ, సినిమా: బయటకెళ్లి చికాకు, కోపంతో ఇంటికి వచ్చినప్పుడు ఐశ్వర్య రాయ్ ఎలా స్పందిస్తుందో అభిషేక్ బచ్చన్ వెల్లడించాడు. ప్రస్తుతం ‘ఘూమర్’ ప్రచారంలో బిజీగా గడుపుతున్న ఆయన.. రీసెంట్ ఇంటర్వ్యూలో కెరీర్ అండ్ తమ దాంపత్య జీవితం గురించి ఓపెన్ అయ్యాడు. ‘నేను ఏదైనా పనిమీద బయకెళ్లి అసంతృప్తితో ఇంటికి వస్తే.. అది గమనించిన ఐశ్వర్య వెంటనే శాంతించమని కోరుతుంది. మన జీవితంలో అంతకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయని గుర్తుచేస్తుంది. ఆరోగ్యకరమైన, సంతోషమైన కుటుంబాన్ని కలిగి ఉన్నారు. మీకు ఇంతకు మించిన ఆనందం మరేది లేదు. దేని గురించి హైపర్ అవుతున్నారో దాన్ని మనసులోనుంచి తీసేయండని మోటివేట్ చేస్తుంది’అని చెప్పాడు. అలాగే కోవిడ్ టైమ్‌లో ఫ్యామిలీ మొత్తం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ‘మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. కోవిడ్ వల్ల చాలా కుటుంబాలు నాశనమయ్యాయి. ఇంతకంటే మన లైఫ్‌కు కావాల్సిందేమిటి’ అని కుటుంబంలోనూ ధైర్యం నిపిందంటూ భార్యను పొగిడేశాడు.
Read More: ఇండస్ట్రీలో అతనొక్కడే అసలైన మొగాడు.. మహిళలను కన్నెత్తి కూడా చూడడు: Kangana Ranaut