AISWARYA RAI - ABHISHEK BACHAN : ఐశ్వర్యతో విడాకులపై సస్పెన్స్‌కు తెరదించిన అభిషేక్ బచ్చన్.. సారీ అంటూ ప్రకటన..

బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడాకులు తీసుకోబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. అనంత్ అంబానీ పెళ్లిలో బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వస్తే.

Update: 2024-08-12 09:12 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ విడాకులు తీసుకోబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. అనంత్ అంబానీ పెళ్లిలో బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వస్తే.. ఐశ్వర్య, తన కూతురు వేరుగా రావడం ఈ అనుమానాలకు బలాన్ని ఇచ్చింది. ఇప్పటికే ఐశ్వర్య ఆ కుటుంబం నుంచి విడిపోయి మరో ఇంట్లో ఉంటుందని... దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని రూమర్స్ వచ్చాయి. కానీ దీనిపై ఎవరు కామెంట్ చేయకపోవడం, సైలెన్స్ మెయింటెన్ చేయడంతోపాటు అభిషేక్ విడాకుల పోస్టుకు లైక్ కొట్టడం.. డివోర్స్ పక్కా అనేలా చేసింది.

అయితే తాజాగా ఈ ఇష్యూపై ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు అభిషేక్. 'మీరు అనుకున్న దానికి అపోజిట్ గా జరిగింది. మీరు ఇలా ఎందుకు రాస్తున్నారో మాకు తెలుసు. మీకు టైమ్ పాస్ కావాలి. మేము సెలబ్రిటీస్ కాబట్టి యాక్సెప్ట్ చేయాలి. ఇదిగో మా మ్యారేజ్ రింగ్... స్టిల్ మ్యారీడ్, సారీ ' అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. కొందరి అత్యుత్సాహం ఇందుకు కారణమని తిడుతున్నారు నెటిజన్లు.

Full View

Tags:    

Similar News