ఆ దర్శకుడు విషంతో సమానం.. జాగ్రత్తగా ఉండండి : నటుడి ఆవేదన
ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ విషంతో సమానమని తెలిపాడు నటుడు అభయ్ డియోల్.
దిశ, సినిమా : ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ విషంతో సమానమని తెలిపాడు నటుడు అభయ్ డియోల్. 2009లో వచ్చిన 'దేవ్. డి' సినిమాలో కలిసి పనిచేసిన ఇద్దరు.. ఆ సినిమా సక్సెస్ అయినా మళ్లీ పనిచేయకపోవడానికి కారణం ఇదేనని చెప్పుకొచ్చాడు. తన గురించి నెగెటివిటీని స్ప్రెడ్ చేసేవాడని తెలిపాడు.
'నిజానికి 'దేవ్.డి' షూటింగ్ టైమ్లో అభయ్ నువ్వు ఫైవ్ స్టార్ హోటల్లోనే ఉండాలని కోరుకుంటున్నాను అని అతనే రూమ్ బుక్ చేశాడు. కానీ మీడియాకు మాత్రం నేను ఫైవ్ స్టార్ హోటల్ డిమాండ్ చేస్తున్నానని చెప్పాడు. అది నాకో గుణపాఠం. అందుకే అతన్ని అవాయిడ్ చేస్తూ వస్తున్నా. అనురాగ్ కశ్యప్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇతరులనూ హెచ్చరిస్తున్నా' అని తెలిపాడు.
ఇవి కూడా చదవండి : 'మావా బ్రో' అంటూనే ధమ్కీ ఇస్తున్న విశ్వక్ సేన్