పిఠాపురంలో 'ఆయ్‌' ట్రైలర్‌!

నార్నే నితిన్‌, నయన్‌సారిక జంటగా రూపొందుతున్న చిత్రం 'ఆయ్‌'.

Update: 2024-08-03 14:04 GMT
పిఠాపురంలో ఆయ్‌ ట్రైలర్‌!
  • whatsapp icon

దిశ, సినిమా: నార్నే నితిన్‌, నయన్‌సారిక జంటగా రూపొందుతున్న చిత్రం 'ఆయ్‌'. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అంజి.కె. మణిపుత్ర దర్శకత్వంలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల వేడుకను ఈ నెల 5న ఏపీ డిప్యూటీ సీఎం, కథానాయకుడు పవన్‌కల్యాణ్ నియోజకవర్గమైనా పిఠాపురంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్‌. గోదావరి నేపథ్యంలో ఫన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతాన్ని అందించారు.


Similar News