ఆ స్టార్ హీరో నాతో శృంగారం చేశాడు.. అందుకే డివోర్స్ ఇచ్చింది? మాజీ భార్య సంచలన కామెంట్స్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి సుపరిచితమే.

Update: 2024-03-14 08:35 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి సుపరిచితమే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఇకపోతే అమీర్ ఖాన్ పెళ్లిళ్లు, డివోర్స్, ఎఫైర్ల గురించి తరచూ సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంటుంది. విడాకులు తీసుకున్నా కూడా వీరంతా కలిసి మెలసి ఫ్రెండ్స్ లా ఉంటారంటూ నెట్టింట చర్చించుకుంటారు.

అయితే తాజాగా తన మాజీ భార్య కిరణ్ రావు ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. ‘అమీర్ ను నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాపై చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. రీనా ఉన్నప్పుడే ఆయన నాతో ప్రేమలో ఉన్నాడని, నాతో రొమాన్స్ చేశాడని, సన్నిహితంగా ఉన్నాడని.. ఈ కారణంగానే రీనా అమీర్ ఖాన్ కు డివోర్స్ ఇచ్చిందని ఎన్నో పుకార్లు సృష్టించారు. రీనా విడాకులు ఇవ్వడానికి అసలు నేను కారణమే కాదు.

రీనాతో, అమీర్ ఖాన్ విడిపోయినా రెండు సంవత్సరాలకు మా రిలేషన్ స్టార్ట్ అయ్యింది. ఈ హీరో మూవీకి అసిస్టెంట్ గా చేశాను. కానీ ఆయనతో మాట్లాడకపోయేదాన్ని. ఆ మూవీ విడుదలయ్యాక మూడేళ్లకు మేము సన్నిహితంగా ఉండటం స్టార్ట్ చేశాం. అప్పటికే రీనా- అమీర్ కు డివోర్స్ అయ్యి రెండేళ్లు గడిచింది. లగాన్ చిత్ర షూటింగ్ సమయంలోనే మా మధ్య ప్రేమ చిగురించింది. నాతో రొమాన్స్ చేయడం వల్ల రీనా విడాకులు ఇచ్చింది అనేది పచ్చి అబద్దం” అంటూ కిరణ్ రావు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కిరణ్ రావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.


Similar News