‘మాజీ గర్ల్ ఫ్రెండ్’ పేరుతో చాట్ షాప్ ఓపెన్ చేసిన యువకుడు.. బ్రేకప్ బాధలతో మెనూ!

వ్యాపారంలో సక్సెస్ కావాలంటే అందరిలా ఉంటే సరిపోదు. సరికొత్త ఐడియాలు, వినూత్న నిర్ణయాలు చాలా ముఖ్యం.

Update: 2024-02-01 08:32 GMT

దిశ, ఫీచర్స్: వ్యాపారంలో సక్సెస్ కావాలంటే అందరిలా ఉంటే సరిపోదు. సరికొత్త ఐడియాలు, వినూత్న నిర్ణయాలు చాలా ముఖ్యం. ‘నలుగురిలో నారాయణ’ అనకుండా వింతగా ప్రయత్నించి.. కొత్తగా ట్రై చేయాలి. అయితే ఫెయిల్ అవుతాం.. లేకపోతే ఊహించని రేంజ్‌లో సక్సెస్ అవుతాం. ఒక యువకుడి విషయంలో అదే జరిగింది.

తాజాగా.. బెంగుళూరులోని ఓ యువకుడి బుర్రకు తట్టిన ఐడియా అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏం చేశాడంటే.. చాట్ షాప్ నిర్వహిస్తున్న సదరు వ్యక్తి తన షాప్‌కి దానికి ‘ఎక్స్‌ గర్ల్ ఫ్రెండ్ బంగర్ పేట్ చాట్స్’ అని పేరు పెట్టాడు. ఇదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈ షాప్‌లోకి అడుగు పెట్టగానే మీ బ్రేకప్ బాధలను అర్థం చేసుకునే మెనూ కార్డును కూడా దర్శనమిస్తుంది. చాట్ ప్లేట్‌తో ఓదార్పుని కోరుకునే హృదయ విదారకమైన ఆత్మలకు ఇది ఒక గమ్యస్థానం అనే క్యాప్షన్స్‌తో ఆ హోటల్ నిండిపోయి ఉంది. ప్రస్తుతం ఈ ‘ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చాట్’కు జనాలు క్యూ కడుతున్నారు.

అటుగా వెళ్లిన కొందరు దీనిని గమనించి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతుంటే.. మరి కొందరు బిజినెస్ క్లిక్ కావడం కోసం చేసిన ప్రయత్నం అని కొట్టి పారేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఫొటోస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Similar News