అనుకున్న దాని కంటే వారం ముందుగానే OTTలోకి ‘లవ్ మీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ బేబీ సినిమాతో ఏకంగా హీరోయిన్‌గా మారిన వైష్ణవి చైతన్య అందరికీ సుపరిచితమే.
దిశ, సినిమా: షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ బేబీ సినిమాతో ఏకంగా హీరోయిన్‌గా మారిన వైష్ణవి చైతన్య అందరికీ సుపరిచితమే. ఈ సినిమాతో అమ్మడికి విపరీతైమన క్రేజ్ పెరిగింది. ఇక ఈ సినిమా భారీ విజయం సాధించడంతో వైష్ణవి తాజాగా లవ్ మీ అనే హరర్ అండ్ లవ్ స్టోరీలో నటించింది. దిల్ రాజు కుటుంబం నుంచి వచ్చిన ఆశీష్ ఈ మూవీలో హీరోగా నటించాడు. కిరణ్ భీమవరం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య మే 25న విడుదలయ్యింది. అయితే అంచనాలను అందుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా.. హర్షిత్ రెడ్డి, హన్సిత నిర్మాతలుగా వ్యవహరించారు.
ఇదిలా ఉండగా థియేటర్లలో నిరాశపరిచిన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. అది కూడా అనుకున్న దాని కంటే వారం ముందుగానే. లవ్ మీ చిత్రం ఓటీటీ రైట్స్‌ను భారీ మొత్తం చెల్లించి ఈ సినిమాను కొనుగోలు చేసి ఆహా దక్కించుకుంది.. వాస్తవానికి ఈ సినిమా జూన్ 23 అలా ఓటీటీలో స్ట్రీమ్ అవ్వాలి. కానీ వారం ముందుగానే అనగా జూన్ 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆహా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.